ప్రభాస్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ దిగుతున్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఆయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశాడు ప్రభాస్. అందులో ముందుగా రాధేశ్యామ్ విడుదలకు సన్నద్ధమవుతోంది. దీని తర్వాత ప్రభాస్ సలార్ మూవీ కోసం రెడీ అవుతాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కరగందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయాల్సి ఉంది. ఇన్ని సినిమాలు ఉండగా ప్రభాస్ ‘సలార్’ సినిమాను ట్రాక్‌లోకి తెస్తున్నాడు. జనవరి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదగడం.. భారీ రెమ్యునరేషన్స్ కారణంగా జాన్ అబ్రహం కూడా విలన్‌గా నటించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట. అలాగే ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించి మరింత క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com