నాని వల్ల 5 సార్లు ఏడ్చా.. బాలీవుడ్ స్టార్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని.. ఎమోషన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఎలాంటి వేరియేషన్ తో అయినా ప్రేక్షకులని కట్టి పడేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే నాని నటనకు అంతటి క్రేజ్ ఉంది. రెండేళ్ల క్రితం విడుదలైన 'జెర్సీ' చిత్రం నానిని నటుడిగా మరో స్థాయికి చేర్చింది.
ఆ చిత్రంలో నాని నటన అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడమే కాదు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగులో జెర్సీ చూసిన వెంటనే ఈ మూవీ రీమేక్ లో నటించాలని డిసైడ్ అయినట్లు షాహిద్ అప్పట్లో తెలిపాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో జెర్సీ గురించి మరిన్ని విశేషాలు పంచుకున్నాడు.
ఇదీ చదవండి: షాకింగ్: రూ.150 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్..
కబీర్ సింగ్ కంటే ముందుగానే జెర్సీ చూశా. ఆ టైంలో నేను సంతోషంగా లేను. నేను చేస్తున్న చిత్రాల పట్ల సంతృప్తి లేదు. సరైన కథ లేకుండా చాలా సినిమాలు చేశా. దీనితో జెర్సీ చూసిన వెంటనే ఇకపై మంచి కథలతో సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు షాహిద్ తెలిపాడు.
జెర్సీ కథతో నేను బాగా రిలేట్ అయ్యా. నాని తన పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ చిత్రంలో నాని నటన చూసి దాదాపు 5 సార్లు ఏడ్చేశా అని షాహిద్ తెలిపాడు. జెర్సీ కుటుంబం మొత్తం చూడాల్సిన చిత్రం.. నా మనసుకు దగ్గరైన చిత్రం అని తెలిపాడు. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో సత్యరాజ్ పాత్రని హిందీలో పంకజ్ ప్లే చేస్తున్నారు. త్వరలో జెర్సీ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments