బాలయ్యకు విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్లనుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తాడని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. బోయపాటి సినిమాల్లో భారీ తారాగణం, పవర్‌ఫుల్ విలన్ ఉంటాడు. అలాంటి ఓ పవర్‌ఫుల్ విలనిజం ఉన్న తన సినిమాలోని పాత్రకు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్‌ను బోయపాటి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట.
ప్రస్తుతం బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`ను పూర్తి చేసే పనిలోఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ చిత్రంలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య తన 106 చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా స్టార్ట్ చేయబోతున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments