బాలయ్యకు విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌?

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్ల‌నుంది. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. స్క్రిప్ట్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్ ద‌త్ న‌టిస్తాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బోయ‌పాటి సినిమాల్లో భారీ తారాగ‌ణం, ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ ఉంటాడు. అలాంటి ఓ పవ‌ర్‌ఫుల్ విల‌నిజం ఉన్న త‌న సినిమాలోని పాత్ర‌కు బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌ను బోయ‌పాటి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ 105వ చిత్రం 'రూల‌ర్‌'ను పూర్తి చేసే పనిలోఉన్నాడు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ ముగింపు దశ‌కు చేరుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ చిత్రంలో వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే బాల‌య్య త‌న 106 చిత్రాన్ని బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.