బాలీవుడ్ సింగర్‌పై నిషేధం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికాసింగ్‌పై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిషేధాన్ని విధించింది. పాకిస్థాన్ కరాచీలో మికాసింగ్ ఓ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మికా సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్లు పాకిస్థాన్ ప్రవర్తిస్తుంది. ఇలాంటి తరుణంలో మికాసింగ్ దేశ ప్రయోజనాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
మాజీ పాకిస్థాన్ ప్రధాని పర్వేజ్ ముష్రాఫ్ కజిన్ కుమార్తె వివాహ సందర్భంగా జరిగినే వేడుకలో మైకా సింగ్ పాల్గొన్నారు. ఆయన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇకపై ఎవరూ మికాసింగ్‌తో కలిసి పనిచేయరాదని ప్రకటించారు. అలా ఎవరైనా పనిచేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుంటామని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments