Adnan Sami:గోల్డెన్ గ్లోబ్‌పై జగన్ ట్వీట్.. ‘‘తెలుగు జెండా’’ పదంపై అద్నాన్ సమీ ఫైర్ , ఇక రచ్చ రచ్చ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినిమా సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పటికే వివిధ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌ని అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను ఎగురవేశారంటూ .. రాజమౌళి, ఎంఎం కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు జెండా కాదు.. భారతీయ జెండా :
అయితే జగన్ ట్వీట్ వివాదాస్పదమైంది. ఇందులో జగన్ వాడిన ‘‘తెలుగు జెండా’’ అనే మాటపై బాలీవుడ్ లెజండరీ సింగ్ అద్నాన్ సమీ అభ్యంతరం తెలిపారు. తెలుగు జెండా ఏంటీ , భారతీయ జెండా అని కదా అనాలంటూ వెంటనే ట్వీట్ చేశారు. ముందు మనమంతా భారతీయులమని, దేశం నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. 1947లో ఇలాంటి విధానాలను మనం చూశామని, ఇది మంచిది కాదని సమీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశభక్తి గురించి మాకు చెప్పొద్దన్న వైసీపీ మంత్రులు :
ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు సమీకి ఘాటుగా బదులిచ్చాయి. తమ భాషను గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన .. దేశాన్ని తక్కువ చేసినట్లు కాదని, మా దేశ భక్తిపై ఎవరో తీర్పు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటరిచ్చారు. మరో మంత్రి విడదల రజనీ కూడా స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ఒకరి సొంత గుర్తింపులో గర్వపడట దేశభక్తిని తగ్గించదని, ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటువాదాన్ని ప్రకటించడం కాదన్నారు. నెటిజన్లు కూడా ఇదే స్థాయిలో సమీపై మండిపడ్డారు. పాకిస్తాన్‌లో పుట్టి ఇండియన్‌గా కన్‌వర్ట్ అయిన నువ్వు దేశభక్తి గురించి భారతీయులకు పాఠాలు చెప్పొద్దంటూ హితవు పలికారు.
Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country!
— Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023
This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!!
Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments