రజనీకాంత్ తో నటించబోయే బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ `2.0` తర్వాత హీరో ధనుష్ స్వంత బ్యానర్ వండర్ బార్స్ సంస్థలో కబాలి ఫేమ్ పా రంజిత్‌తో రూపొందించబోయే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నాయి. రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్లో రూపొందిన కబాలి చిత్రానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణనే ఇప్పుడు కూడా రజనీకాంత్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను మే 28న లాంఛనంగా ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ముందు ఈ సినిమాలో రజనీకాంత్ సరసన విద్యాబాలన్ హీరోయిన్గా నటిస్తుందని కూడా న్యూస్ వినపడింది, అయితే విద్యాబాలన్ తప్పుకోవడంతో యూనిట్ వర్గాలు మరో బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలని ముమ్మరంగా ప్రయత్నించారు. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్‌తో హ్యుమా ఖురేషి జోడి కట్టనుంది. త్వరలోనే ఈ విషయం అధికారకంగా వెలువడనున్నట్లు సమాచారం. ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనె, సోనాక్షిసిన్హా, రాధికా అప్టే తర్వాత రజనీకాంత్‌తో మరోసారి బాలీవుడ్ బ్యూటీయే నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments