బాలీవుడ్ హీరోయిన్‌తో బన్నీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ తన కెరీర్‌ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. 2020లో మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులు సాధించారు. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’గా కనిపించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా మారేడుమిల్లిలో జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే స్టైలిష్ స్టార్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్‌ను నటింప చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దబాంగ్3లో సల్మాన్‌ఖాన్‌తో నటించిన సయీ మంజ్రేకర్, ఇప్పుడు వరుణ్‌తేజ్, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
మెసేజ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో చెబుతూ అన్నీ విజయవంతమైన చిత్రాలనే తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రం ద్వారా కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, బన్నీ స్నేహితుడు శాండీ, స్వాతి, నట్టి నిర్మాతలుగా మారుతున్నారు. ఈ మధ్య వైజాగ్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనను ఆధారంగా చేసుకుని కథ సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెర్చ్ స్టూడెంట్ అయిన హీరో ఓ ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ప్రమాదంలో చనిపోయిన వారి గురించి చేసే అన్వేషణలా కథ సాగుతుందని టాక్. మరి ఈ వార్తలపై బన్నీ అండ్ గ్యాంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments