బన్నీకి నేను పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ఏకంగా సల్మాన్‌ఖాన్‌తో నటించి అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ సయీ మంజ్రేకర్. దబాంగ్3లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి అడివిశేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న మేజర్ కాగా.. మరో సినిమా వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న గని. ఈ అమ్మడు తన సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతి శుక్రవారం అమ్మతో కలిసి తాజ్ హోటల్‌కి వెళ్లేదాన్ని. ఆ తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు ఆ దాడికి సంబంధించి చేసిన ఆపరేషన్ మూవీ మేజర్‌లో నటించడం యాదృచ్చికమే. తెలుగులో మంచి సినిమాలతో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
తెలుగు హీరోల్లో నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన అల వైకుంఠపురములో సినిమా చూశాను. తెలుగులో హీరోయిన్‌గా అవకాశం రాగానే నేను చూసిన తొలి తెలుగు సినిమా అదే. అందులో ఆయన నటన, డాన్స్ చూసి ఫిదా అయిపోయాను. ఆయనతో త్వరలోనే నటించే అవకాశం వస్తుందని భావిస్తున్నాను. కథ నచ్చితే భాష గురించి ఆలోచించకుండా నటిస్తాను. ఈ విషయాన్ని నాన్న నాకు చెప్పారు. ’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com