కాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మోడల్, బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బాలీవుడ్‌లో సంచలనాన్ని రేపాయి. వివిధ రంగాల్లో స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ప్రతిగా మీ టూ ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్ తాము అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందులను తెలియజేశారు. వీరి వరుసలో ఎల్లీ అవ్రామ్ కూడా చేరింది. ఇద్దరు దర్శకులు ఒక రోజు రాత్రి తమతో గడపాలని అడిగారని చెప్పింది. స్పీడన్‌కు చెందిన ఎల్లీ బాలీవుడ్‌లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చేదు ఘటనలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
బాలీవుడ్‌లో అప్పటికే పరిచయమున్న ఓ స్నేహితురాలు `స్వీట్ హార్ట్ నువ్వు ఎప్పటికీ నటివి కాలేవు. ఎందుకంటే నువ్వు పొట్టిగా ఉన్నావ`ని చెప్పింది. అలాగే మరికొందరు నా నుదురు, పళ్లు బాగాలేదని, మరికొందరు నా జుట్టు పొడవుగా ఉందని, అంటీలా ఉన్నానన్నారు. అయితే నేను ఎవరి మాటలను పట్టించుకోలేదని తెలిపారు. అలాగే ఆఫర్స్ కోసం మీటింగ్స్ వెళ్లిన సందర్భాల్లో ఇద్దరు దర్శకులు షేక్ షేండ్ ఇస్తూ నా చేతిని వాళ్ల వేలితో గోకారు. నా స్నేహితుడి దగ్గర దీని గురించి ప్రస్తావించగా, వాళ్లు తమతో ఓ రాత్రి నిన్ను గడపమని అంటున్నట్లు దానికి అర్థం అని తను చెప్పాడు. ఇలాంటి సమస్యలను చాలానే ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com