కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన బాలీవుడ్ హీరోయిన్

  • IndiaGlitz, [Thursday,October 03 2019]

మోడ‌ల్, బాలీవుడ్ న‌టి ఎల్లీ అవ్రామ్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బాలీవుడ్‌లో సంచ‌ల‌నాన్ని రేపాయి. వివిధ రంగాల్లో స్త్రీల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు ప్ర‌తిగా మీ టూ ఉద్య‌మం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు హీరోయిన్స్ తాము అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న సమ‌యంలో ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందుల‌ను తెలియ‌జేశారు. వీరి వ‌రుస‌లో ఎల్లీ అవ్రామ్ కూడా చేరింది. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఒక రోజు రాత్రి త‌మ‌తో గ‌డ‌పాల‌ని అడిగార‌ని చెప్పింది. స్పీడ‌న్‌కు చెందిన ఎల్లీ బాలీవుడ్‌లో అవ‌కాశాల కోసం తిరుగుతున్న‌ప్పుడు చేదు ఘ‌ట‌న‌లు ఎదురయ్యాయ‌ని పేర్కొన్నారు.

బాలీవుడ్‌లో అప్ప‌టికే ప‌రిచ‌య‌మున్న ఓ స్నేహితురాలు 'స్వీట్ హార్ట్ నువ్వు ఎప్ప‌టికీ న‌టివి కాలేవు. ఎందుకంటే నువ్వు పొట్టిగా ఉన్నావ‌'ని చెప్పింది. అలాగే మ‌రికొంద‌రు నా నుదురు, ప‌ళ్లు బాగాలేద‌ని, మ‌రికొంద‌రు నా జుట్టు పొడ‌వుగా ఉంద‌ని, అంటీలా ఉన్నానన్నారు. అయితే నేను ఎవ‌రి మాట‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. అలాగే ఆఫ‌ర్స్ కోసం మీటింగ్స్ వెళ్లిన సంద‌ర్భాల్లో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు షేక్ షేండ్ ఇస్తూ నా చేతిని వాళ్ల వేలితో గోకారు. నా స్నేహితుడి ద‌గ్గ‌ర దీని గురించి ప్ర‌స్తావించ‌గా, వాళ్లు త‌మ‌తో ఓ రాత్రి నిన్ను గ‌డ‌ప‌మ‌ని అంటున్న‌ట్లు దానికి అర్థం అని త‌ను చెప్పాడు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను చాలానే ఎదుర్కొన్నాన‌ని ఆమె తెలిపారు.

More News

'సైరా' క‌న్నా వెన‌క‌బ‌డ్డ 'వార్‌'

ఈ గాంధీ జ‌యంతి రోజున మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` విడుద‌లైంది. తెలుగు స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లో చిరంజీవికి పోటీ లేక‌పోయినా..

‘మీకు మాత్రమేచెప్తా’ నవంబర్1న రిలీజ్

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది..

గోపీచంద్‌-తమన్నాచిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3)

దిల్ రాజు చేతుల మీదుగా ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్

850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు.

ఆ పాత్ర‌కు చిరు ప్రాణం పోశారు: రాజ‌మౌళి

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితగాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.