ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేుషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది. రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం అబుదాబిలో జరుగుతుండగా.. ప్రధానపాత్రధారులపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యింది. ‘యే జవానీ హై దివానీ’, ‘యారియా’, ‘మై తేరా హీరో’, ‘కుచ్ కుచ్ లోచా హై’ వంటి చిత్రాల్లో నటించిన ఎవ్లిన్ శర్మ కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని ఎవ్లిన్ శర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియుజేసింది. ఇందులో యాక్షన్ రోల్లో కనపడనున్న ఎవ్లిన్ పాత్ర కోసం పది కిలోల బరువు కూడా తగ్గడం విశేషం. వచ్చే యేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com