బాల‌య్య‌తో బాలీవుడ్ హీరోయిన్‌?

  • IndiaGlitz, [Thursday,December 12 2019]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఒక ప‌క్క రూల‌ర్ సినిమాతో డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. అయితే రీసెంట్‌గా త‌న 106వ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించిన సంతి కూడా విదితమే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, బోయ‌పాటి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను న‌టింప చేయ‌డానికి డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బాల‌య్య సినిమాలో క‌న్న‌డ హీరోయిన్ రుచితా రామ్ స‌హా ప‌లువురు పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. ఆ క్ర‌మంలో ఇప్పుడు సోనాక్షి సిన్హా పేరు విన‌ప‌డుతుంది. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. అఇయ‌తే త్వ‌ర‌లోనే బాల‌య్య 106వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. అలాగే ఈ చిత్రంలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం. ఆయ‌న కూడా దాదాపు సుముఖంగానే ఉన్నాడ‌ని డేట్స్ అడ్జ‌స్ట్ విష‌యానికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. అలాగే మాజీ హీరోయిన్‌, న‌టి, ఎమ్మెల్యే రోజా కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో బోయ‌పాటి భారీ రేంజ్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. బోయ‌పాటి సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటూనే భారీ హంగులుంటాయి. త‌న గ‌త చిత్రాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాల‌య్య 106 చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట బోయ‌పాటి. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ డూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. బాల‌కృష్ణ‌ను ఈసారి బోయ‌పాటి ఎలాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చూపిస్తాడో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.