'ఆది పురుష్' లో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ ఎపిక్ విజువల్ వండర్ మూవీ ఆది పురుష్ కి సంబంధించని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ధీటుగా ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్సకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓం రౌత్ గతంలో దర్శకత్వం వహించిన తానాజీ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ఉదయ్ భాన్ అనే ప్రతినాయక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆదిపురుష్ కోసం మరోసారి ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతినాయకునిగా నటించబోతున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆదిపురష్ టైటిల్ తో పాటు, ప్రభాస్ ను ఈ చిత్రంలో హీరోగా పరిచయం చేస్తూ అధికారిక ప్రకటణ చేసిన చిత్ర తాజాగా సైఫ్ అలీఖాన్ ను విలన్ గా పరిచయం చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా
దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. తానాజీ చిత్రంలో ఉదయ్ భాన్ క్యారెక్ట్ కి సైఫ్ అలీ ఖాన్ తన నటనతో ప్రాణం పోశారు. ఈ చిత్రంలో సైఫ్ క్యారెక్టర్ అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు ఆది పురుష్ లో కూడా సైఫ్ పాత్ర చాలా వైవిధ్యంగా విలక్షణంగా ఉండబోతుంది. 7000 ఏళ్ల క్రిందట ఉన్న ఓ తెలివైన రాక్షసుని స్వభావం ప్రేరణగా ఆదిపురుష్ లో సైఫ్ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రంలో సైఫ్, ప్రభాస్ మధ్య కత్తి యుద్ధాలు, వీరు ఇద్దరు ఎదరుపడినప్పుడు జరిగే పోరాటలు అత్య అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆది పురుష్ లో రెబల్ స్టార్ ప్రభాస్ క్యారెక్టర్ కి ధిటైన విలన్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. తానాజీలో సైఫ్ నటన, నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. 7000 ఏళ్ల క్రిందట ఉన్న ఓ తెలివైన రాక్షసుడు స్వభావం, తీరు తెన్నులతో ఆదిపురుష్ లో విలన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ చెప్పినప్పటి నుంచి ఈ ప్రాతకు ఎవరైన స్టార్ హీరో కుదిరితే బాగుంటుదనుకున్నాను. ఈ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ పరెఫెక్ట్ గా సరిపోతారని నా నమ్మకం. ప్రభాస్, సైఫ్ ఆన్ స్క్రీన్ పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా అన్నారు. ఈ ఎపిక్ డ్రామాను భారీ బడ్జెట్ తో గ్రాఫిక్ హంగులు జోడించి రూపొందిస్తున్నట్లుగా తెలిపారు భూషణ్ కుమార్.
తారాగణం; రెబల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com