హిందీలో 'జనతా గ్యారేజ్' రీమేక్.. కన్నేసిన స్టార్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ చిత్రాలకు ప్రస్తుతం నార్త్ లో డిమాండ్ ఎక్కువ. బాలీవుడ్ హీరోలు తెలుగు, తమిళ కథలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఘనవిజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్ లో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
2016లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా నటించాడు. బలమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. పర్యావరణ పరిరక్షణ అనేది యూనిక్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ కథపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జనతా గ్యారేజ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సల్మాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ మేరకు మైత్రి మూవీస్ సంస్థతో చర్చలు కూడా జరిగాయని బిటౌన్ వర్గాల నుంచి సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థే హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు, హీరోయిన్ లాంటి కీలక అంశాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. సల్మాన్ ఖాన్ కి తెలుగు కథలంటే ఆసక్తి ఎక్కువే. కండల వీరుడు ఆల్రెడీ రవితేజ కిక్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ పర్యావరణాన్ని ప్రేమించే స్టూడెంట్ గా నటించాడు. మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించడం విశేషం. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది కొరటాల దర్శకత్వంలోనే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments