హిందీలో 'జనతా గ్యారేజ్' రీమేక్.. కన్నేసిన స్టార్ హీరో

సౌత్ చిత్రాలకు ప్రస్తుతం నార్త్ లో డిమాండ్ ఎక్కువ. బాలీవుడ్ హీరోలు తెలుగు, తమిళ కథలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఘనవిజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్ లో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

2016లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా నటించాడు. బలమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. పర్యావరణ పరిరక్షణ అనేది యూనిక్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ కథపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.

జనతా గ్యారేజ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సల్మాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ మేరకు మైత్రి మూవీస్ సంస్థతో చర్చలు కూడా జరిగాయని బిటౌన్ వర్గాల నుంచి సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థే హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు, హీరోయిన్ లాంటి కీలక అంశాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. సల్మాన్ ఖాన్ కి తెలుగు కథలంటే ఆసక్తి ఎక్కువే. కండల వీరుడు ఆల్రెడీ రవితేజ కిక్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ పర్యావరణాన్ని ప్రేమించే స్టూడెంట్ గా నటించాడు. మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించడం విశేషం. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది కొరటాల దర్శకత్వంలోనే.

More News

'రామారావు' గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

మాస్ మహారాజ్ రవితేజ 68వ చిత్రం శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా

శిరీష బండ్ల స్పేస్ సూట్ పై ఇండియన్ ఫ్లాగ్.. అతడికి కూడా ఇండియాతో..

తెలుగు వనిత శిరీష బండ్ల చరిత్ర సృష్టించింది. విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మూడో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు కల్పన చావ్లా, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్లారు.

బాబోయ్.. ఏంటి అఖిల్ జోరు.. 'ఏజెంట్' గా కిల్లింగ్ సిక్స్ ప్యాక్ లుక్

యంగ్ హీరో అఖిల్ అక్కినేని గత కొన్నిరోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక అఖిల్ తదుపరి క్రేజీ డైరెక్టర్

అలా మొదలైన కత్తి మహేష్ ప్రయాణం.. ఎన్నో వివాదాలు, మలుపులు

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. కత్తి మహేష్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేవారు. తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడే వారు.

కత్తి మహేష్ మృతి.. షాక్ లో నాని, మంచు మనోజ్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరణ వార్త టాలీవుడ్ లో విషాదాన్ని మిగిల్చింది. కత్తి మహేష్ తో అనుబంధం ఉన్న సెలెబ్రిటీలంతా ఆయనకు