'బుట్టబొమ్మ' సాంగ్ కి డాన్స్ కుమ్మేసిన బాలీవుడ్ హీరో.. రీమేక్ లో అతడే..
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' గత ఏడాది విడుదలై కలక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ స్టైల్, పూజా గ్లామర్, త్రివిక్రమ్ టేకింగ్ చిత్రాన్ని ఒక స్థాయిలో నిలబెడితే.. తమన్ సంగీతం సినిమాని మరో స్థాయికి చేర్చింది.
ఇప్పటికీ ఈ చిత్ర పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎందరో స్టార్ సెలెబ్రిటీలు ఈ చిత్రంలో పాటలకు చిందేశారు. అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇది. తాజాగా బాలీవుడ్ క్రేజీ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ కు డాన్స్ అదరగొట్టాడు.
అల్లు అర్జున్ అనుకరించకుండా ఎనెర్జిటిక్ గా ఉండే కొత్త స్టెప్పులు ట్రై చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు అంటూ రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ తాజాగా నిజమయ్యాయి. అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు అల వైకుంఠపురములో రీమేక్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హిందీ రీమేక్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించాడు. అతడికి జంటగా కృతి సనన్ హీరోయిన్ ఆ నటిస్తుందట. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. పురిటిలో బిడ్డలని మార్చే కాన్సెప్ట్ తో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. టబు, జయరాం.సచిన్ ఖేడ్కర్, మురళి శర్మ, హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments