పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో, హీరోయిన్.. ఎంట్రీ ఎప్పుడంటే ?

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓ పీరియాడిక్ డ్రామాలో నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారట.

ఇదీ చదవండి: వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్

షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే గడుస్తోంది. కానీ ఇంతవరకు వీరిద్దరూ సెట్స్ కి హాజరు కాలేదు. దీనిపై నిర్మాత ఏఎం రత్నం తాజాగా క్లారిటీ ఇచ్చారు. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఇద్దరూ నెక్స్ట్ షెడ్యూల్ లోనే షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలిపారు.

కరోనా ప్రభావం తగ్గాక వెంటనే షూటింగ్ ప్రారంభిస్తాం అని రత్నం అన్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులని బట్టి ముందుకు వెళతాం అని తెలిపారు.

More News

విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విరించి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లక్షల్లో ఫీజు వేయడంతో అంత ఫీజు ఎలా అయ్యింది?

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి..

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్.

ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు.

లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..

మంత్రి కేటీఆర్‌కు రోజుకు ఎన్నో విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా వెళుతుంటాయి. అప్పుడప్పుడు అభిమానులు ఆయనకు పలు సూచనలు కూడా చేస్తుంటారు.