రామ్ చరణ్ కోసం బాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వాని కథానాయికగా నటిస్తోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, అనన్య, నవీన్ చంద్ర, మహేష్ మంజ్రేకర్, వివేక్ ఒబెరాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ఈ నెలాఖరు నుంచి తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌లో చరణ్ కూడా పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. ఇది యాక్షన్ బేస్డ్ మూవీ కావడంతో చరణ్.. బాలీవుడ్ ట్రైనర్ రాకేశ్ ఉదియర్ పర్యవేక్షణలో ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చేది రాకేశ్ ఉదియర్ కావడం విశేషం. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com