ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

  • IndiaGlitz, [Friday,October 04 2019]

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్' ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సినిమాను కొన్న బ‌య్య‌ర్లంద‌రికీ లాభాలు వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌ముఖ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ఈ రీమేక్లో న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆరు నెల‌లో వ్య‌వ‌థిలో రెండు తెలుగు సినిమా రీమేక్‌లు బాలీవుడ్‌లో విడుద‌లై ఘ‌న విజయాల‌ను సాధించాయి. టెంప‌ర్ సినిమాను సింబాగా రీమేక్ చేశారు. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టించారు. అలాగే అర్జున్ రెడ్డి చిత్రాన్ని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా చేశాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ రీమేక్‌లోనూ ర‌ణ‌వీర్ సింగ్‌ను న‌టింప చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఈ జూలై నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. మరి హిందీ రీమేక్‌ను ఎవ‌రు డైరెక్ట‌ర్ చేస్తార‌నే తెలియాల్సి ఉంది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ని స‌మాచారం. తెలుగులో నిధి అగ‌ర్వాల్‌, న‌భాన‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టించారు.

More News

'మామాంగం' నవంబర్ 21న రిలీజ్‌

భారత దేశం  సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి.

కొత్త ఇల్లు క‌ట్టుకుంటున్న బ‌న్నీ.. పేరేంటో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త‌ ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

అక్టోబ‌ర్ 8న `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` విడుద‌ల

ఒక‌బ్బాయి, అమ్మాయి.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డ అమ్మాయి.. త‌న ప్రేమ‌ను మాత్రం అత‌నికి చెప్ప‌దు.

టాలీవుడ్ , బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న పురాణపండ ' హనుమంతుడు'

అనంత రూపాలతో, అనంత బాహువులతో  మహా స్వరూపంగా ఈ లోకాన్ని సంరక్షిస్తున్న ఆంజనేయ భగవానునిపై

సైరా తొలిరోజు క‌లెక్ష‌న్స్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.