ఇద్దరు తెలుగు స్టార్ హీరోలపై దృష్టి సారించిన బాలీవుడ్?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఇద్దరు తెలుగు స్టార్స్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రామాయణం ఇతివృత్తం ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూపొందించేందుకు టి సిరీస్ సిద్ధమైన అనంతరం.. మహేష్ బాబు హీరోగా మరో బాలీవుడ్ నిర్మాత రామాయణం ఇతివృత్తం ఆధారంగానే సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. నిర్మాత మధు మంతెన రామాయణ ఇతివృత్తం ఆధారంగా ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది.
ఈ పాన్ ఇండియా మూవీలో రావణుడి పాత్రలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ నటించనున్నారని సమాచారం. అలాగే సీతాదేవి పాత్రలో దీపిక పదుకొణె నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాముడి పాత్ర కోసం చిత్ర బృందం సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇదంతా నమ్మశక్యంగా అయితే అనిపించడం లేదు. కేవలం పేపర్లకే పరిమితమని కార్యరూపం దాల్చే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ కారణంగా ఇది ముడిపడే అవకాశం లేదని సమాచారం.
ఈ ప్రాజెక్టును ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్ రూపొందించబోతున్నారని మూడేళ్ల క్రితమే టాక్ వినిపించింది. ఆ తర్వాత ఎందుకో కానీ దీని ఊసే వినిపించలేదు. తిరిగి ఇప్పుడు ఈ సినిమా గురించి టాక్ వినబడుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించేంత ఫైనాన్షియల్ సోర్సులు మధు మంతెన దగ్గర లేవని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సగం అల్లు అరవింద్ సమకూర్చినప్పటికీ మిగిలిన సగం సమకూర్చేంత ఆర్థిక వనరులైతే మధు మంతెన దగ్గర లేవని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments