బన్నీని ఒక ఛాన్స్ ఇవ్వమన్న బాలీవుడ్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి’ రికార్డులను సినిమా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌తో పాటు తమన్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పాటలన్నీ ఆదరణ పొందాయి. పాటలన్నీ వంద మిలియన్ వ్యూస్న క్రాస్ చేశాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ...’ సాంగ్ 263 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను చూసిన ఓ బాలీవుడ్ దర్శకుడు బన్నీకి పెద్ద అభిమానిగా మారిపోయాడు.
వివరాల్లోకెళ్తే.. కాబిల్, షూటౌట్ ఎట్ లోఖౌండ్వాలా, జబ్బా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ గుప్తా రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌లో ‘అల... వైకుంఠపురములో’ సినిమా చూసి ట్వీట్ పెట్టారు. ‘సినిమా ఎంతో వినోదభరితంగా ఉంది. బిగ్ స్క్రీన్‌పై చూడకపోతే ఆ లోటు ఉండిపోతుంది. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడ్డాక సినిమాను వీలైనంత త్వరగా బిగ్ స్క్రీన్‌పై చూడాలి’ అన్నారు. సంజయ్ ట్వీట్‌కు బన్నీ రిప్లయ్ ఇస్తూ ‘మీరు చూసి ఇష్టపడ్డందుకు థాంక్స్’ అన్నారు. దీనికి సంజయ్ స్పందిస్తూ ‘బన్నీ.. మీ యాక్టింగ్‌కి కనెక్ట్ అయ్యాను. మీరు నన్ను నవ్వించారు, ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో వర్క్చేయడానికి ఒక అవకాశం కోస ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. మరి బన్నీ ఎలా రిప్లై ఇస్తాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com