దక్షిణాది సినిమాల పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్....
- IndiaGlitz, [Saturday,December 15 2018]
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్రమే. దక్షిణాది సినిమా అంటే ప్రాంతీయ చిత్రాలుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి 2', '2.0' చిత్రాలు బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్స్‌ను సాదిస్తున్నాయి.
దీని పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం గమనార్హం. భారీ చిత్రాలను తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు ఎందుకు సక్సెస్ అవుతున్నారనే ప్రశ్న వేశారాయన.
దక్షిణాది దర్శకులకు సినిమాలు చేయాలంటే చాలా ప్యాషన్ అందుకనే ఆయనే అన్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో విడుదలైన పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.