ట్విట్టర్‌ని వదిలేసిన బాలీవుడ్ దర్శకుడు .. కారణమేంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
సామాజిక సమస్యలపై సినిమాలు తీసే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ట్విట్టర్ మాధ్యమం నుండి బయటకు వచ్చేశారు. అందుకు కారణం.. ఆయన తల్లిదండ్రులు, కుమార్తెకు బయట వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడమేనట. ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ట్విట్టర్ వేదికగా దయ్య బట్టిన అనురాగ్ కశ్యప్‌కు ఇది వరకే ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే రీసెంట్‌గా కశ్మీర్ వ్యవహారంపై కూడా ఆయన తన వైఖరిని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్పందించారు. దీనిపై ఆయనకు బలమైన బెదిరింపులే వచ్చినట్లు ఉన్నాయి.
ట్విట్టర్ చివరి ట్వీట్‌గా ``ప్రస్తుతం దుర్మార్గులు రాజ్యమేలుతున్నారు. బెదిరించే వ్యక్తులదే జీవన విధానంగా ఉంది. నా కుటుంబంలోని తల్లిదండ్రులు, నా కుమార్తెను కొందరు బెదిరించారు. ఇలాంటి సందర్భాల్లో నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయలేను. అలాంటప్పుడు మౌనంగానే ఉండిపోతాను. సరికొత్త భారతదేశంలో ఉన్నవారు అభివృద్ధిలోకి వస్తారు. అందరికీ శుభాకాంక్షలు గుడ్ బై`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments