ఎన్టీఆర్ సినిమాకు బాలీవుడ్ కెమెరామెన్
Send us your feedback to audioarticles@vaarta.com
జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమా చేయకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో అన్న కల్యాణ్‌రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని, ఈ సినిమాకు నట విశ్వరూపం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్‌గా పి.కె. త్రీ ఇడియట్స్, మొహంజదారో, ఏజెంట్ వినోద్ వంటి చిత్రాలకు వర్క్ చేసిన మరళీధన్ అనే సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఫిబ్రవరి నుండి సినిమా సెట్స్‌లోకి వెళుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com