యంగ్ టైగర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి భారీ బడ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికి చిత్రీకరణ ముగిసేది. ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభమై ఉండేది. కానీ పరిస్థితులపై కలిసి రాలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే త్రివిక్రమ్ మాత్రం ఓపికగానే తారక్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్ నటించనుందట. లవ్యాత్రిలో నటించిన వరీనా హుస్సేన్‌ను ఇందులో హీరోయిన్ నటించనుందని, లుక్ టెస్ట్ అంతా పూర్తయ్యిందని కూడా టాక్ వినిపిస్తోంది.
'అరవిందసమేత' తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’.. 'రాజా వచ్చినాడు’, ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్‌ను నటింప చేస్తారని వార్తలు వినపడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com