హీరోతో రిలేషన్ షిప్.. ఇక దాగుడుమూతలు వద్దనుకుంటోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ పర్సనల్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ ఎఫైర్ ల ప్రవాహానికి బలైన వారిలో కత్రినా కూడా ఉంది. చాలా కాలం పాటు వీరిద్దరూ బీచ్ లు, వెకేషన్స్ కి తిరుగుతూ రిలేషన్ షిప్ కొనసాగించారు.
వారిద్దరూ కలసి ఉన్న కొన్ని దృశ్యాలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కత్రినాకు చాలా టైం పట్టింది. మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని కత్రినా అప్పట్లో తెలిపింది.
అయితే ఇదంతా గతం. ఆమె జీవితంలో మళ్ళీ ప్రేమ చిగురించింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ హీరో విక్కీ కౌశల్ తో ఈ హాట్ బ్యూటీ డేటింగ్ చేస్తోంది. విక్కీ కౌశల్ కత్రినా కన్నా వయసులో నాలుగేళ్లు చిన్న. అయినప్పటికీ ఈ కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉంది ఈ బ్యూటీ.
ఈ ఎఫైర్ విషయంలో కత్రినా కొంత సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. బాహాటంగా బయట తిరగడం, మీడియాకు కనిపించడం చేయలేదు. కానీ కత్రినా త్వరలోనే తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కత్రినా ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments