వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
డిజిటల్ మాధ్యమానికి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుంది. అక్షయ్‌కుమార్, అభిషేక్ బచ్చన్, జాకీష్రాఫ్ ఇలా ఎందరో బాలీవుడ్ తారలు డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారమైన వెబ్‌సిరీస్‌ల్లో నటించినవారే. ఇప్పుడు ఈ లిస్టులో మరో బాలీవుడ్ తార చేరనుంది. ఆమె ఎవరో కాదు.. అందాల తార జాక్వలైన్ ఫెర్నాండెజ్. శిరీష్ కుందన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ 'మిసెస్ సీరియల్ కిల్లర్'లో జాక్వలైన్ నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందన్ తెలియజేస్తూ జాక్వలైన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. భర్తను కాపాడుకోవడానికి ఓ మహిళ హత్య చేయాల్సిన కారణం ఏంటనేదే ఈ వెబ్‌సిరీస్ ప్రధాన కథాంశమట. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రసారం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com