ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీకే ప్రాధాన్యత..!

  • IndiaGlitz, [Saturday,April 25 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అంతా స‌జావుగానే సాగుతున్న‌స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. ఈలోపు ప్రభాస్ 21కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో దర్శక నిర్మాతలున్నారు. పాన్ ఇండియా కాదు.. వరల్డ్ సినిమాగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్ర‌భాస్ జ‌త‌గా దీపికా ప‌దుకొనెను న‌టింప చేయాల‌ని నిర్మాత‌లు భావించి ఆమెను సంప్ర‌దించార‌ట‌. అందుకు దీపికా దాదాపు రూ.20 కోట్లను డిమాండ్ చేసిందట‌. దీంతో నిర్మాత‌లు హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలైన కియారా అద్వానీతో సంప్రదింపులు చేస్తున్నారట. మరి బిజీ బిజీగా ఉండే కియారా ప్రభాస్ పక్కన నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.

మరో పక్క ప్రబాస్ 20కి ‘రాధేశ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయట. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సగానికిపైగానే చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు. ప్రభాస్ అండ్ టీమ్ స్పీడుకు కరోనా బ్రేకులేసింది. అయితే జార్జియాలో కీలక షెడ్యూల్ పూర్తి కావడంతోలాక్డౌన్ సమయానికి అంతా టీమ్ ఇండియా చేరుకున్నారు. మిగిలిన షెడ్యూల్‌ను సెట్స్ వేసి చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు.

More News

ట్రోల్స్‌కు రాజమౌళి కౌంటర్

దర్శకధీరుడు రాజమౌళి క్వారంటైన్ టైమ్‌లో కావాల్సినన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇదే ఈయనకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో

సూర్య సినిమాలు బ్యాన్..!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

మరో బయోపిక్‌లో కీర్తి సురేశ్..?

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది.

కరోనా వార్‌లోనూ ఉద్ధవ్ థాక్రే వర్సెస్ రాజ్‌థాకరే!

కరోనా మహమ్మారి విస్తరిస్తుండటం.. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ తరుణంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన

భారత్‌లో 23వేలు దాటిన కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23వేలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం నాడు కేసులకు సంబంధించి ఎంసీడీసీ డైరెక్టర్ సుజిత్ కుమార్ సింగ్ మీడియా