పాక్ కళాకారులను బ్యాన్ చేసిన బాలీవుడ్
- IndiaGlitz, [Monday,February 18 2019]
పుల్వామా ఉగ్రదాడి ఫలితం పాక్‌పై చాలా బాగానే ప్రభావం చూపుతుంది. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు సినిమా రంగం.. బాలీవుడ్ కూడా పాకిస్థానీ కళాకారులను బ్యాన్ చేసింది.
ఇండియన్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్ పాక్ కళాకారులతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, మ్యూజిక్ కంపెనీలు పనిచేయవని ప్రకటించారు.
చిత్ర పరిశ్రమకు చెందిన 24 శాఖలకు చెందిన అసోసియేషన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనకు వ్యతిరేకంగా నడిస్తే.. షూటింగ్‌ను ఆపేసి, సినిమా సెట్స్‌ను నాశనం చేసేస్తాం అంటూ అశోక్ పండిట్ ప్రకటించారు.
నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా పాకిస్థాన్ కళాకారులను నిషేధించినట్టు ప్రకటించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన చిత్రాపత్ సేన పాకిస్థానీ కళాకారులను తీసుకోవద్దంటూ మ్యూజిక్ కంపెనీలను హెచ్చరించింది.