బాలీవుడ్ బాబా..
Send us your feedback to audioarticles@vaarta.com
బాబా అంటే పకీర్ కాదులెండి..రజనీకాంత్ బాబా సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టాలను చవి చూశారు. ఆ సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు తిరిగి ఇచ్చేసి వారిని ఆదుకున్నాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ సల్మాన్‌ఖాన్‌కు ఎదురైంది. సల్మాన్ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం `ట్యూబ్‌లైట్`. జూన్ 23న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
సాధారణంగా సల్మాన్ సినిమాలు విడుదలైన వారంలోపే వందకోట్ల మైలురాయిని సులభంగా దాటేస్తుంటాయి. కానీ `ట్యూబ్‌లైట్` సినిమా విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు కేవలం 110 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతో వారిని ఆదుకోవడానికి సల్మాన్ ముందుకొచ్చాడు. 55 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తున్నాడట. ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com