బాలీవుడ్ బాబా..
- IndiaGlitz, [Wednesday,July 12 2017]
బాబా అంటే పకీర్ కాదులెండి..రజనీకాంత్ బాబా సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టాలను చవి చూశారు. ఆ సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు తిరిగి ఇచ్చేసి వారిని ఆదుకున్నాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ సల్మాన్‌ఖాన్‌కు ఎదురైంది. సల్మాన్ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ట్యూబ్‌లైట్'. జూన్ 23న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
సాధారణంగా సల్మాన్ సినిమాలు విడుదలైన వారంలోపే వందకోట్ల మైలురాయిని సులభంగా దాటేస్తుంటాయి. కానీ 'ట్యూబ్‌లైట్' సినిమా విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు కేవలం 110 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతో వారిని ఆదుకోవడానికి సల్మాన్ ముందుకొచ్చాడు. 55 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తున్నాడట. ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి.