బాలీవుడ్ అతిథిగా
Tuesday, June 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి' చిత్రంతో ప్రపంచ ప్రేక్షకులి తనవైపు తిప్పుకున్న ప్రభాస్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనితో ఒక్క సినిమా అయినా చెయ్యాలని హీరోయిన్లు కూడా ఆరాటపడుతున్నారు. కానీ, తను మాత్రం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదిలా వుంటే ప్రభాస్ ఓ బాలీవుడ్ సినిమాలో అతిథిగా కనిపించనున్నాడన్న వార్త వినిపిస్తోంది. ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో చక్రి తోలేటి దర్శకత్వంలో 'ఖామోషి' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నాడట. అతన్ని ఈ విషయంలో ఒప్పించేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో మరి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments