బాల‌య్య‌తో బాలీవుడ్ బ్యూటీ...

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

బాల‌కృష్ణ రూపొందుతోన్న 103వ చిత్రం 'య‌న్టీఆర్‌'. త‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి జీవిత‌గాథ‌లో నటుడు నుండి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అయ్యే వ‌ర‌కు ఉన్న ఘ‌టాల‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తేజ తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ నెల 29న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తారకంగా ప‌లువురు హీరోయిన్స్ పేర్లు పరిశీల‌న‌లోకి వ‌చ్చాయి. వీరిలో నిత్యామీన‌న్ కూడా ఉంది. నిత్యా మీన‌న్ కూడా సినిమాలో చేయ‌న‌ని ప‌క్క‌కు త‌ప్పుకుంది.

ఇప్పుడు తేజ బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్ర‌దిస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం 'య‌న్టీఆర్‌' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. విద్యాబాల‌న్ కూడా అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

More News

ఆగ‌స్టులో రానున్న వెంకీ, తేజ చిత్రం

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. శ్రియ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న ఈషా రెబ్బా న‌టించ‌నుంది.

'మ‌హిళా క‌బ‌డ్డి' చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌హిళా క‌బ‌డ్డి'.  ర‌చన స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్  పూర్తి చేసుకుంది.

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.

'రాజరథం' లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

'రాజరథం' లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది.