పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ భామ
Send us your feedback to audioarticles@vaarta.com
తండ్రి అనీల్ కపూర్ బాటలోనే సినీ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సోనమ్‌కపూర్. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటుంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి.
ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా తనెంటో నిరూపించుకుంటున్న సోనమ్ కపూర్ వెంటనే పెళ్లి చేసుకుంటుందా లేక కొంతకాలం ఆగి పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com