తల్లి కాబోతోన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఫోటో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం హీరోయిన్లు వరుసపెట్టి గర్భం దాలుస్తున్నారు. ఒకరి వెంట మరొకరు మాతృత్వాన్ని అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు తన భర్తతో కలిసి బేబీబంప్‌తో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. మా నాలుగు చేతులతో సాధ్యమైనంత వరకూ నిన్ను అన్నివిధాలుగా ఉత్తమంగా పెంచేందుకు శ్రమిస్తాం. నీ ప్రతి గుండె సవ్వడిలో మా రెండు హృదయాలు ధ్వనిస్తూనే ఉంటాయి. నిన్ను ఈ భూమ్మీదకు స్వాగతించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం’’ అని సోనమ్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రెటీలు సోనమ్ దంపతులకు విషెస్ చెబుతున్నారు.
అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సోనమ్‌కపూర్. బిజీగా వున్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడారు. ఆనంద్ అహూజా ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీష్ అహుజా కుమారుడు. ఆయన దేశంలోనే అతిపెద్ద ఎగుమతి సంస్థ అయిన షాహీ ఎక్స్‌పోర్ట్స్ యజమాని. ఈ సంస్థ వార్షిక టర్నోవర్ $450 మిలియన్లకు పైమాటే. ఆనంద్‌కు ఇద్దరు తమ్ముళ్లు అమిత్, అనంత్ అహుజా ఉన్నారు. ప్రస్తుతం సోనమ్, ఆనంద్‌లు లండన్‌లో వుంటున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com