బ‌యోపిక్‌కు నో చెప్పిన బాలీవుడ్ న‌టి

  • IndiaGlitz, [Friday,March 16 2018]

దివంగ‌త నేత‌, మ‌హాన‌టుడు నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'య‌న్‌.టి.ఆర్' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ బ‌యోపిక్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ  టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా  ఈ నెల 29వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

అయితే.. ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి  ఉన్నా..కాల్షీట్స్ స‌మ‌స్య కార‌ణంగా విద్యా నో చెప్పింద‌ని స‌మాచారం. దీంతో మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ప‌డింద‌ట చిత్ర యూనిట్‌.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌మందించ‌నున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. బాల‌కృష్ణ‌తో పాటు సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.