శ్రీకాళహస్తిలో కంగనా రనౌత్ రాహుకేతు పూజలు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి ముందు కంగనా రనౌత్ ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు కంగనాకు శ్రీకాళహస్తీశ్వర ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. కంగనా రనౌత్ వెంట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కంగనా రనౌత్. శనివారం ఉదయం 2 గంటలకు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో కంగనాకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారు. పట్టు వస్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు సాయికుమార్, కూడా వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.
కాగా.. వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కంగనా రౌనత్. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్, రైతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించారు. అంతేకాకుండా ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పాటు కంగనాపై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. కొందరైతే ఆమె నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్క తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments