మల్లేశ్వరి బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్కరించనున్నారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్‌పై సంజనా రెడ్డి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మాతలు.
మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారు? అనే దానిపై చాలా పేర్లే వినిపించాయి. అనుష్క, నిత్యామీనన్,రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయిన్నారు. అయితే పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ను నిర్మాతలు సంప్రదించారని, ఆమె కూడా ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ పాన్ ఇండియా మూవీపై క్లారిటీ రానుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com