మహానటి పాత్రలో బాలీవుడ్ తారలా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ఎవడే సుబ్రమణ్యం` వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
80 వ దశకంలో తనదైన నటనతో ప్రేక్షకులను రంజింప చేసిన సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే మాటలు కాదు, సావిత్రి పాత్రను పోషించడానికి సరిపోయే నటి ఎవరా అని చర్చ మొదలైంది. అయితే నిర్మాతలు ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అందుకని బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్ అయితే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట. టైటిల్ పాత్రలో ప్రియాంక చోప్రా లేదా దీపికా పదుకొనేను కానీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి దర్శక నిర్మాతల సన్నాహాలు ఎంత వరకు సఫలమవుతాయో చూడాలి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com