చిరంజీవి చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్...
- IndiaGlitz, [Sunday,March 21 2021]
మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్‌లో నటించబోతున్న సంగతి కూడా తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో రెండు చిత్రాలను ట్రాక్ ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో ఒకటి తమిళ చిత్రం వేదాళం కాగా.. మరో చిత్రం బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేయాల్సి ఉంది.
డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో చాలా బిజీగా ఉన్నాడట. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ను చిరు పక్కన నటింప చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే ..రజినీకాంత్ ‘లింగ’ తర్వాత ఆమె ఒప్పుకునే రెండో దక్షిణాది సినిమా ఇదే అవుతుంది. మరి సోనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.