గుర్తుపట్టలేనంతంగా మారిపోయా.. మైండ్ బ్లాంక్ అయ్యింది: కోవిడ్ అనుభవాలు పంచుకున్న దీపికా

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

దేశంలో మొదటి, రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో లక్షలాది మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు సెలబ్రెటీలు సైతం వున్నారు. కోవిడ్ సోకి కొందరు మరణిస్తే.. మరికొందరు చావు అంచులదాకా వెళ్లొచ్చు. బతికి బయట్టపడ్డ వారిని పోస్ట్ కోవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. మానసిక, శారీరక సమస్యలతో నేటికీ సతమతమవుతున్న వారు ఎందరో వున్నారు. వీరిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఒకరు. ఆమెతో పాటు తండ్రి ప్రకాష్ పదుకొనే, తల్లి ఉజ్జల, సోదరి అనీషా ఇలా కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడింది.

ఈ సందర్భంగా కోవిడ్ బారినపడటం, తర్వాత తాను ఎదుర్కొంటున్న సమస్యలను దీపిక అభిమానులతో పంచుకున్నారు.

కరోనా సోకిన తరువాత తన జీవితం ఎంతగానో మారిపోయిందని.. తన శరీరంలో ఎన్నో మార్పులొచ్చాయని దీపికా చెప్పింది. చికిత్స సమయంలో వేసుకున్న మందులు, స్టెరాయిడ్స్ వలన గుర్తుపట్టలేనంతగా మారిపోయానని ఆమె తెలిపారు. కోవిడ్ చాలా భయంకరమైందని నాటి రోజులను గుర్తుచేసుకుంది. వైరస్ సోకినప్పుడు పెద్దగా భయపడలేదు కానీ.. కోలుకున్న తరువాత అసలు మైండ్ పని చేయలేదని దీపిక వెల్లడించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలలు షూటింగ్స్‌కి వెళ్లలేదని.... అది తన జీవితంలో చాలా డిఫికల్ట్ ఫేజ్ అంటూ వాపోయారు దీపికా పదుకొనే.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దీపికా 'గెహ్రాయాన్‌' అనే సినిమాలో నటిస్తోంది. శకున్ బాత్రా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక త్వరలో ప్రభాస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీపికా . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్‌బి అమితాబ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

More News

తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం.. కట్టప్పకు పాజిటివ్, పరిస్ధితి విషమం..?

సినీ పరిశ్రమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, మహేశ్‌బాబు , మంచు లక్ష్మి, త్రిష, మీనా

కరోనాతో ఐసీయూలో .. రెండు రోజుల్లో నా శవానికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ కంటతడి

2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని సంగతి తెలిసిందే.

సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ప్రకటించిన జగన్

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది.

భార్యకు కరోనా, ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్‌లో... అయినా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.

కోరలు చాస్తున్న కరోనా.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు పాజిటివ్

దేశంలో కోవిడ్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఇవాళ కొత్త కేసుల సంఖ్య లక్ష దాటేసింది.