Alia Bhatt: ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అలియా.. షాకైన కరణ్ జోహార్, వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
యుక్త వయసుకు రాగానే.. యువతీ యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఇలా వుండాలి.. అలా వుండాలి. వాళ్లతో అది చేయాలి, ఇది చేయాలని కలలు కంటూ వుంటారు. ఇందుకోసం ప్లాన్డ్‌గా వెళ్లేవారు కూడా ఎందరో వున్నారు. ఇక పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ గురించి కూడా ఎన్నో కలలు కంటారు . ఇది ఏ మనిషి జీవితంలోనైనా జరిగిదే. ఇందుకు సామాన్యులే కాదు, సెలబ్రెటీలు కూడా అతీతులేం కాదు. కానీ ఇలాంటి విషయాలు అంత తేలిగ్గా బయటకు రావు. కొన్ని ఇంటర్వ్యూల్లో యాంకర్లు , ఇతర జర్నలిస్టులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ ప్రముఖులు బయటపడరు. అయితే ఇలాంటి విషయాలు బయటకు తీసుకురావడంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణో జోహార్ స్పెషలిస్ట్.
కాఫీ విత్ కరణ్‌కు గెస్ట్ గా అలియా - రణ్‌వీర్ సింగ్:
ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వుంది. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ కోసం ఆయన మళ్లీ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సమంతా ఈ చిత్రీకరణలో పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
అంత ఓపిక ఎవరికీ ఉండదు:
ఇకపోతే.. ఫస్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ఇటీవలే పెళ్లయిన అలియా భట్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అలియా భట్ ఫస్ట్ నైట్ గురించి కరణ్ ప్రశ్నించారు. దీనికి ఆమె ఏం సమాధానం చెబుతారా అని ఊహించగా.. జోహర్ కు షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి తొలి రాత్రి లాంటిది అనేది వుండదని, అప్పటికి చాలా అలసిపోయి వుంటామని అలియా భట్ అన్నారు. మరి ఈ షోలో ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments