బెల్లంకొండ శ్రీనివాస్‌తో బాలీవుడ్ యాక్ట‌ర్‌....

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నవీన్ శొంటీనేని (నాని) నిర్మిస్తున్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన రావ‌చ్చు.

ప్ర‌స్తుతం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన సాక్ష్యం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. మే 18న సినిమా విడుద‌ల కానుంది.