రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...
Friday, April 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్‌చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు. ఇక `టచ్ చేసి చూడు` సినిమా విషయానికి వస్తే, పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రన్ అవుతుందని సమాచారం.
ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడబోతున్నాడు. రవితేజతో ఢీ అంటే ఢీ అనే విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ ప్రెడ్డి దరువాలా నటించనున్నాడు. కమెండో 2, ఫోర్స్ 2 చిత్రాల్లో నటించి ఫ్రెడ్డికి టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా షెడ్యూల్లో హీరో హీరోయిన్ మధ్య మాంటేజ్‌సాంగ్, కొన్ని సీన్స్‌ను చిత్రీకరించారట. విదేశాల్లో షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన యూనిట్ మరో షెడ్యూల్‌ను పాండిచ్చేరిలోనే ప్లాన్ చేయడం విశేషం. ఈ చిత్రంలో రాశిఖన్నా ఓ హీరోయిన్గా నటిస్తుంది. మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments