వెంకీతో బాలీవుడ్ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీని ఓ కీలక పాత్రలో తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అంతా ఓకే అయితే సినిమాకు సంబంధించిన యూనిట్ అధికారిక ప్రకటనను వెలువరిచే అవకాశం ఉంది.
తరుణ్ భాస్కర్ వెంకటేశ్ కోసం డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడట. వివరాల ప్రకారం వెంకటేశ్ రేస్ కోర్స్, హార్స్ రైడింగ్ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించబోతున్నారట. ఈ సన్నివేశాలను హైదరాబాద్ మలక్‌పేటలోని రేస్ కోర్స్‌లో చిత్రీకరించబోతున్నారట తరుణ్ భాస్కర్. తరుణ్ వెంకటేశ్ సినిమా స్క్రిప్ట్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారని సమాచారం. డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి
ప్రస్తుతం `వెంకీమామ` సినిమాతో వెంకటేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగచైతన్యతో వెంకీ చేసిన సందడి సినిమా సంక్రాంతికి విడుదలైయ్య అవకాశాలున్నాయని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com