టాలీవుడ్‌లోకి బాలీవుడ్ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కథానాయకుడు కునాల్ కపూర్ త్వరలోనే తెలుగు తెరపై దర్శన మీయనున్నాడు. ఈ నటుడు ఇప్పటికే ఓ తెలుగు సినిమాలో నటించేశాడు. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. 'దేవదాస్'. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. దేవ అనే మాఫియా డాన్‌గా నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని నటించారు.
శాంతాబాయ్ హాస్పిటల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో కునాల్‌కపూర్ విలన్‌గా నటించారు. యూనిట్ కునాల్‌కు సంబంధించిన విషయాలను సీక్రెట్‌గా ఉంచింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఎంటైర్‌టైనింగ్ ఫార్మేట్‌లో సాగే ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరోయిన్స్‌గా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments