మరో విషాదం.. దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం దిగ్గజ నటుడు, సీనియర్ హీరో రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా.. కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్యతో కూడా ఆయన బాధపడుతున్నారని.. తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. గురువారం ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే ఇర్ఫాన్ మరణంతో బాలీవుడ్ శోఖ సంద్రంలో ఉండగా ఇలా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఇద్దరూ కూడా కేన్సర్‌తో చనిపోవడం బాధాకరం. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ అన్న విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్ సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇలా..
1952 సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్లాడారు. రిషికపూర్ కుమారుడే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్. రిషి కపూర్ 1973లో ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దివానా’, ‘కాదల్’, ‘లైలా మజ్నూ’, ‘చాందినీ’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. 51 సినిమాల్లో నటించిన ఆయన 41 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఈయనకు నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు పలు అవార్డ్స్ దక్కాయి. బాలీవుడ్‌ను శాసించిన కపూర్ ఫ్యామిలి నుంచి ఆయన అగ్రశ్రేణి నటుడిగా ఎదిగారు. ఆయన సోదరుడు రణధీర్ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com