నాని మూవీలో బాలీవుడ్ నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్‌రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఎంసిఎ`(మిడిల్ క్లాస్ అబ్బాయి) లో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్‌వర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
పింక్ సినిమాలో తనదైన నటనతో మెప్పించిన విజయ్‌వర్మకు దర్శకుడు వేణు శ్రీరాం మంచి స్నేహితుడట. తను చెప్పిన కథ నచ్చడంతో విజయ్ వర్మ చేయడానికి అంగీకరించాడు. ఓ మై ఫ్రెండ్ సినిమా తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నాని గత చిత్రం నేను లోకల్ కూడా దిల్‌రాజు బ్యానర్‌లో రూపొంది సక్సెస్ అయ్యింది. నాని హీరోగా రూపొందిన నిన్ను కోరి చిత్రం జూలై 7న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments