విజయ్ దేవరకొండకు హిందీ హీరో కాంప్లిమెంట్‌!

  • IndiaGlitz, [Sunday,October 28 2018]

'అర్జున్‌రెడ్డి' అంటే విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ అంటే 'అర్జున్‌రెడ్డి' అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 'అర్జున్‌రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ జీవించాడు కాబట్టే సినిమా అంత ఘన విజయం సాధించింది. ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మంది సినిమాను 'కల్ట్ క్లాసిక్'గా అభివర్ణిస్తున్నారు.

ఈ సినిమాను తమిళంలో 'వర్మ' పేరుతో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా దర్శకుడు బాల రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌కి తెలుగులో 'అర్జున్‌రెడ్డి'కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల హిందీ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా హీరో షాహిద్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డికి విజయ్ దేవరకొండ విషెస్ తెలిపారు. అందుకు షాహిద్ కపూర్ బదులిస్తూ బ్రదర్... సినిమాలో మీ పాత్ర ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఎన్ని రీమేకులు వచ్చినా మీరే ఒరిజినల్‌ అని ట్వీట్ చేశారు.

షాహిద్ కపూర్ స్పందనాకు విజయ్ దేవరకొండ ప్రతిస్పందిస్తూ బిగ్‌ బ్రదర్‌... మీరంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. మీరు, సందీప్‌ కలిసి మ్యాజిక్‌ చేస్తారు. మిమ్మల్ని కబీర్‌ సింగ్గా చూడాలని ఆతృతగా ఉంది అన్నారు. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో కథానాయికగా నటించిన కియారా అడ్వాణీ, 'కబీర్ సింగ్'లో షాహిద్‌ కపూర్ సరసన నటిస్తున్నారు.

More News

చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం 'చంద్రోదయం'. ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణమదే: విశాల్‌

'పందెంకోడి' చిత్రంతో తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'పందెంకోడి-2'.

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న

ట్రూ సక్సెస్ దిశగా 'టు ఫ్రెండ్స్' 

అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి, రాయలసీమ ముద్దు బిడ్డగా, అనంతపురం ఆణిముత్యంగా అభివర్ణించబడే బహుముఖ ప్రజ్ఞాశాలి

అదుగో చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ ఓవ‌ర్..

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.